Tuesday, November 26, 2024

చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ఆసక్తికర ట్వీట్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ రి మాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున వాదిస్తున్న సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్థ్‌ లూథ్రా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన ఆయన ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. బుధవారం హైకోర్టులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో పిటిషన్లు దాఖలు చేసిన సిద్ధార్థ్‌ లూథ్రా ట్విట్టర్‌ వేదికగా ఒక ట్వీట్‌ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైందని గురు గోవింద్‌ సింగ్‌ పేర్కొన్న వ్యాఖ్యలను సిద్ధార్థ్‌ లూథ్రా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదమని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. మీరే గెలుస్తారంటూ రీట్వీట్‌లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement