ముంబై నటిపై కేసు వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు ఏపీ ప్రతిష్ఠను మంటగలిపిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తొలిసారి స్పందించిన చంద్రబాబు… వైసీపీ నాయకులు ముంబై సినీ నటి జత్వానీపై పోర్జరీ కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
బాధితులను రక్షించాల్సిన పోలీసులే ఆమెను బెదిరించి, చిత్రహింసలకు గురిచేసి అరెస్టు చేసి కస్టడీలో పెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహరంలో తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని చెప్పారు. మహిళల భద్రతకు టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.