టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తయింది. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది.
శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు.