Thursday, October 24, 2024

AP | చంద్ర‌బాబువి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్.. జగన్

  • హ‌త్య‌లు, లైంగిక వేధింపులు,
  • డ‌యేరియా మ‌ర‌ణాలు నిత్య‌కృత్యం
  • వాటిని చంద్ర‌బాబు పట్టించుకోవ‌డం లేదు
  • త‌న‌పైనా, త‌న కుటుంబం పైనే దృష్టి పెట్టారు
  • కుటుంబ వ్య‌వ‌హారాల జోక్యంతో చంద్ర‌బాబు త‌ల‌మున‌క‌లు
  • పాల‌న గాలికొదిలేశారు.. సూప‌ర్ సిక్స్ ను మ‌రిచిపోయారు
  • గుర్ల డ‌యేరియా బాధితుల‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌
  • చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యంతోనే మ‌ర‌ణాలంటూ ఫైర్

విజ‌య‌న‌గ‌రం : ఒక వైపు హత్యలు, మరో వైపు లైంగిక వేధింపుల పర్వాలు, ఇంకోవైపు డయేరియాతో మరణాలు… ఇన్ని జ‌రుగుతుంటే చంద్ర‌బాబు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు వైసిపి అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. అస‌లు ఎపిలో ప్ర‌భుత్వం ఉందా అంటూ నిల‌దీశారు.. విజయనగరం జిల్లా గుర్లలో డయోరియోతో బాధ పడుతున్న బాధితులను గురువారం ఆయ‌న పరామర్శించారు. డయేరియాతో మరణించిన బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జ‌రిగిన విషాద వివ‌రాల‌ను బాధితుల‌ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌కు పార్టీ ప‌రంగా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ… డయేరియాతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని, బాధితులకు సాయం అందించదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రామాలను సస్యశ్యామలం చేశామని, గ్రామ సచివాలయాల ద్వారా సేవలు అందించమన్నారు.

చంద్ర‌బాబు వి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్…
రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్‌ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టిచ‌డంలో చంద్ర‌బాబు దిట్ట అంటూ విమ‌ర్శించారు. ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడంతో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి సమస్యలను డైవర్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయని, త‌మ కుటుంబంలో సమస్యలున్నాయ‌ని అన్నారు.. అవి త‌మ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌ని, వాటిని సైతం చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం వాడుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు. ఇటువంటిపై వాటిని ఆపి ప్రజల స‌మ‌స్య‌ల ప‌రిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు దృష్టిసారించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement