ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వరద ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలిస్తున్నారు.
ఇప్పటికే లక్షల ఎకరాల్లో పంటలకు వర్షంతో నష్టం వాటిల్లింది. వేలాదిగా పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. వరద ప్రాంతాలను ఇప్పటికే సీఎం జగన్ భారీ వర్షాల ప్రభావంపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే తాజాగా రేపటినుంంచి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital