Friday, November 22, 2024

AP: ఉదయించే సూర్యుడిలా చంద్రబాబు తిరిగొస్తారు.. ఎమ్మెల్యే గంటా


విశాఖపట్నం, అక్టోబర్‌ 3: ఉదయించే సూర్యుడిలా చంద్రబాబు తిరిగొస్తారని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అక్రమ అరెస్టు అని నిరసిస్తూ టీడీపీ నేతలు మంగళవారం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ సమీప వినాయక ఆలయం వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వార్డు పార్టీ సీనియర్‌ నేతలు, కార్పొరేటర్‌ అభ్యర్థి, టీడీపీ జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్‌, ఆ వార్డు అధ్యక్షులు కన్నం వెంకట రమణారావు, సెక్రెటరీ ముక్కి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడారు. రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

బాబుపై పెట్టిన కేసులు అక్రమమేనని అందరికీ తెలుసునని, ఎక్కడా అవినీతికి పాల్పడని చంద్రబాబు.. తాను అవినీతికి పాల్పడి 16నెలల జైలు అనుభవించి బయటికి వచ్చిన తర్వాత సీఎం అయ్యి కేవలం రాజకీయ కక్షతోనే జగన్‌ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. బాబు అక్రమ అరెస్టుపై దేశ, విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. 70దేశాల్లో మేము సైతం అంటూ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తమ జీతాల సొమ్ముతో చంద్రబాబును బయటకు తీసుకువస్తామంటున్నారన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని, భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ఏపీ ప్రజలకు భరోసా కల్పించేందుకే చంద్రబాబు బయటకు రావాలని దీక్షకు పూనుకున్నారన్నారు.


బండారు అరెస్టు దారుణం..
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు కూడా కక్ష సాధింపేనని, ఓ సంఘటనకు సంబంధించి స్పందించి మాట్లాడినందుకు అక్రమంగా కేసులు పెట్టారని గంటా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, జగన్‌ బాధపడే రోజులొస్తాయన్నారు. మన నాయకుడు త్వరలో తిరిగి వస్తారని మనకు, మన రాష్ట్ర అభ్యున్నతను అభివృద్ధిని చేస్తారని కార్యకర్తలకు గంటా భరోసా ఇచ్చారు. అనంతరం బాబుకు మద్దతుగా సంతకాలు చేశారు. నిరసనలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు రాజాన రమేష్‌, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి విజయ్‌ బాబు, జనసేన నాయకులు కూడా పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్‌ తోట శ్రీదేవి, పార్లమెంటరీ పార్టీ వాణిజ్య విభాగ కార్యదర్శి దువ్వి కాళీ ప్రసాద్‌, ఎన్టీఆర్‌ సేవా సంఘ సభ్యులు శ్రీకృష్ణ, ఎంఎల్‌ఎన్‌ రావు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కుట్టా కార్తీక్‌, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వాసుపల్లి రాజు, జిల్లా పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్‌, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులు బొడ్డేపల్లి లలిత, జాన్‌, మాజీ కార్పొరేటర్‌ పొలమరశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సెల్‌ ప్రెసిడెంట్‌ కోలా రామారావు, 14వ వార్డు ప్రెసిడెంట్‌ గొంప ధర్మారావు, 24వ వార్డు ఐటీడీపీ గంటా శ్రీను, 26వ వార్డు ప్రెసిడెంట్‌ ముక్కా కిషోర్‌, 43వ వార్డు కాళ్ల శ్రీనివాస్‌, 44వ వార్డు ప్రెసిడెంట్‌ కాళ్ళ గౌరీ శంకర్‌ నాయుడు, మహిళా అధ్యక్షురాలు మళ్ల లక్ష్మి, సతీష్‌, 45వ వార్డు ప్రెసిడెంట్‌ భరణికాన రాజు, 46వ వార్డు ప్రెసిడెంట్‌ పుక్కల్ల పైడికొండ, జోష్‌ యాదవ్‌, 47వ వార్డు ప్రెసిడెంట్‌ చెంగల శ్రీను, సెక్రెటరీ సత్యనారాయణ రాజు, ఏడుకొండలు, నూకరాజు, 48వ వార్డు ప్రెసిడెంట్‌ గొర్లె అప్పారావు, 49వ వార్డు సెక్రటరీ వాసు, 51వ వార్డు సీనియర్‌ నాయకులు సనపల కీర్తి, 55వ వార్డు ప్రెసిడెంట్‌ వీరు బాబు, 42వ వార్డు కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement