విజయవాడ దుర్గమ్మ రేపు (బుదవారం) సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. కాగా, బెజవాడ దుర్గమ్మును రేపు సీఎం చంద్రబాబు సతీమణితో కలిసి దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారికి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించినున్నారు.
కాగా, రేపటి మూలా నక్షత్రం ఏర్పాట్లపై మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణతో పాటు కలెక్టర్ సృజన, సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ…
రేపు ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. కాగా, ఉదయం 8గంటల నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రేపు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని… సీఎంకు 2 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించామని తెలిపారు. బంగారు మండపం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు దర్శనం చేసుకోనున్నారు.