పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంతిమయాత్ర కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముంబై వెళ్లనున్నారు.
రతన్ టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించనున్నారు. 11:45 నిమిషాలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో గన్నవరం వెళ్ళనున్నారు చంద్రబాబు, లోకేష్. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇద్దరు నేతలు ముంబైకి వెళ్లనున్నారు.