అమరావతి: ఫ్లై యాష్ రగడపై సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి నేతలు ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు వివాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో, వైఎస్సార్ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇరుపార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
- Advertisement -