Friday, January 24, 2025

AP | శ్రీశైలం మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు..

పున్నమి ఘాట్ లో రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “సీ ప్లేన్” ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా సీ ప్లేన్” ల్యాండ్ అయ్యింది. ఈ అద్భుత ఆవిష్కరణ వీక్షించిన పాతాళగంగ లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తమ హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ త‌ర్వాత పాతాళగంగ నుంచి రోప్ వే ద్వారా శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం స్వామి వారి తీర్ధ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు అల‌య అధికారులు..


రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement