విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని ఇవాళ ఉదయం చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకోనున్నారు. వచ్చే వారంరోజుల పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను చంద్రబాబు సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
ఇవాళ దుర్గమ్మ దర్శనం అనంతరం సాయంత్రం విశాఖపట్టణం వెళ్తారు. రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకుంటారు. ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు.