Thursday, October 17, 2024

AP: ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు – అయిదు హామీలపై తొలి సంతకం ..

ఈ అయిదు అంశాలే విజయంలో కీలకం
మెగా డీఎస్సీపైనే తొలి సంతకం
ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​ రద్దు
నెలవారీ సామాజిక పెన్షన్​ 4వేలకు పెంపు
అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ
నైపుణ్య గణన పైల్ పై అయిదో సంతకం
చంద్రబాబుకు అమరావతిలో రైతుల ఘన స్వాగతం
సచివాలయంలో మళ్లీ చంద్రబాబు కళ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నేటి సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే తొలిసారిగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. సుమారు ఆరు లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. 2014లో 10,313 టీచర్ పోస్టులు భర్తీ కాగా.. పదేళ్లుగా బీఈడీ కోర్సులు పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం నిర్యుద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమా? గత ప్రభుత్వం 6100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇక‌.. ఈ స్థితిలో తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరీ హామీలిచ్చారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు తొలి సంతకం చేశారు.

- Advertisement -

అలాగే రైతుల భూముల రక్షణ కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు పైల్ పై రెండవ సంతకం.. నెలవారీ సామాజిక పెన్షన్ ₹ 4000లకు పెంపుదల పైల్ పై మూడో సంతకం,.. అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఫైల్ పై నాలుగో సంతకం, నైపుణ్య గణన పైల్ అయిదో సంతకం చేశారు.

అమరావతి రైతుల ఘన స్వాగతం

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబుకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు.

అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్‌ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement