న్యూఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్‌ను పంపమని సీజేఐకి నివేదిస్తామని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరించారు.
ఈ ఇద్దరు బెంచ్ లో ఉన్న న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.. జస్టిస్ అనిరుద్దబోస్ ఈ కేసులో 17 ఎ వర్తిస్తుందని తీర్పు ఇవ్వగా, మరో న్యాయమూర్తి త్రివేది ఈ సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు.. తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో త్రిసభ్య ధర్మసనానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తి నివేదించారు..