ఆర్థిక అసమానతలను ప్రభుత్వం తొలగించుకుంటూ పోవాలని చంద్రబాబు అన్నాడు. ప్రభుత్వం ఇష్ట ప్రకారం పరిపాలన చేసుకుంటూ పోతానంటే అభివృద్ధి జరగదని విమర్శించారు. టీడీపీ మహానాడు నిర్వహణలో భాగంగా ఆయన ఈ రోజు వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. అప్పులు చేసుకుంటూ పోతున్నారని.. ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అప్పులు ఇచ్చే వారు కూడా కరవైపోతారు రాష్ట్రం దివాళా తీస్తుంది.. ఈ విషయాలను హైదరాబాద్‌లో అభివృద్ధిని ఎప్పుడు చూసినా నాకు చాలా సంతృప్తి కలుగుతోంది. నా వల్ల వచ్చిన కంపెనీల వల్ల నేను చాలా సంతృప్తి చెందుతున్నాను’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
భారత్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించిచెప్పాను. మైక్రోసాఫ్ట్ బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని కోరాను. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వస్తే ప్రపంచంలోని అనేక ఐటీ కంపెనీలు అక్కడకు వస్తాయని భావించాను. అనంతరం అదే జరిగింది. నేడు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
రాజకీయ కక్ష కోసం తాను ఎన్నడూ ప్రయత్నాలు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు