Sunday, July 7, 2024

Tributes – మ‌న్యం వీరుడు అల్లూరికి చంద్ర‌బాబు, రేవంత్ నివాళి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నేడు ఎపి, తెలంగాణ‌ల‌లో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు అక్క‌డ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో అల్లూరి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు కేంద్ర‌ మంత్రులు, కూట‌మికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు..

రేవంత్ అంజ‌లి…

ఇక ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా అల్ల‌రికి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు..బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు, భారత స్వాతంత్ర చరిత్రలో మరిచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి సీతారామరాజు అంటూ ట్విట్ చేశారు రేవంత్ ..

అలాగే ఎపి మాజీ మఖ్య‌మంత్రి జ‌గ‌న్,టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి , మంత్రి నారా లోకేష్ లు కూడా అల్లూరికి నివాళుల‌ర్పించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement