టాలీవుడ్ దిగ్గజ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అల్లు అరవింద్ కు ఫోన్ చేసిన పరామర్శించారు. జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వద్దని.. ఆయనకు ధైర్యం చెప్పారు.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, హీరో అల్లు అర్జున్ ఈ రాత్రికి చంచల్ గూడ జైలులో ఉండనున్నారు. అల్లు అర్జున్ రేపు ఉదయం 6 గంటల తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా, అల్లు అర్జున్ బెయిల్ కాపీని హైకోర్టు అధికారికంగా అప్‌లోడ్ చేసింది. బెయిల్ కాపీని పరిశీలించిన చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ రేపు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.