తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమైంది. వంగవీటి రాధాకు అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. రెక్కీ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గన్ మెన్లను తిరస్కరించడం సరికాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ద వద్దన్న చంద్రబాబు.. రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని చెప్పారు.
మరోవైపు తనను చంపేందుకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. రాధాకు ప్రభుత్వం 2+2 గన్‌మెన్ భద్రత కేటాయించింది. అయితే తనకు కల్పించిన భద్రతను రాధాకృష్ణ తిరస్కరించారు. విజయవాడ సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది మంగళవారం(డిసెంబర్ 28) సాయంత్రం రాధా కార్యాలయానికి వెళ్లగా.. ఆయన వారిని వెనక్కి పంపేశారు. తనకు ఎలాంటి భద్రతా అవసరం లేదని, తనపై అభిమానంతో ప్రజలే రక్షకులుగా ఉంటారని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital