Friday, November 22, 2024

Independence day celebrations – హైద‌రాబాద్ లో చంద్ర‌బాబు, మంగ‌ళ‌గిరిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ లు జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌…

హైద‌రాబాద్ మంగ‌ళ‌గిరి – తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ లు 77వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ తో కలసి జాతీయ  జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుక హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్ద జరిగింది. జెండా ఆవిష్కరణకు ముందు చంద్రబాబు, ఆయన మనవడు దేవాన్ష్ మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కొబ్బరి కాయ కొట్టారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరిగింది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అక్కడున్న సిబ్బంది అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. మరోవైపు 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నేటి మన స్వాతంత్య్ర ఫలం ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితమేనన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, దేశ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని ఆకాంక్షించారు. ఈ విషయంలో ఓ విజన్ ప్రకారం పనిచేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు

ఇక జ‌న‌సేనాని మంగ‌ళ‌గిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో జ‌రిగిన స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌లో పాల్గొన్నారు..ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement