బీసీలకు టీడీపీ రిజర్వేషన్లు ఇస్తే, జగన్ రద్దు చేశారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆఖరికి బీసీ జన గణనలోనూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. జగన్ రెండేళ్లుగా కార్పొరేషన్ వ్యవస్థ అనేదే లేకుండా చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చేతి వారికి పరికరాలు, సబ్సిడీలు ఎత్తేశారని ఆరోపించారు. జగన్ తన సొంత సామాజికవర్గంతో పదవులను నింపుకున్నారని ఆక్షేపించారు. బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. క్షేత్రస్థాయిలో బీసీ నాయకత్వాన్ని పటిష్ఠపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బీసీలకు రాజకీయ, సామాజిక అభివృద్ధికి పునాది వేసింది టీడీపీయేనని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వైసీపీ అణచివేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ అమలు చేసిన 35కి పైగా పథకాలను రద్దు చేశారని వివరించారు.
ఇది కూడా చదవండి: అంతర్జాతీయ కుట్రలో భాగంగా జరుగుతోంది: కంగనా రనౌత్