Monday, January 20, 2025

Zurich | తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి చంద్రబాబు : లోకేష్

  • ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు.
  • పెట్టుబడిదారుల అనుకూల విధానాలను.
  • 15 రోజుల్లోగా అన్ని అనుమతులు.

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబాబు… జ్యూరిచ్‌లోని హిల్డెన్ హోటల్‌లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…

‘‘ఈ సంద‌ర్భంగా ఇక్క‌డికి తర‌లి వచ్చిన వ్యాపారవేత్తలు, యూరఫ్ ఎన్నారై టీడీపీ సభ్యులకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదన్నారు. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యూరిచ్ లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా..? అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏడు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వం.. పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో యూనిట్లు నెలకొల్పే సంస్థలకు 15 రోజుల్లోగా అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ యూనివర్శిటీలతో కలిసి పనిచేయాలని స్విస్ పరిశోధనా సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. చేతిలో ఫైళ్లతో న్యూయార్క్ వీధుల్లో తిరిగారని అన్నారు. ఆ రోజు చంద్ర‌బాబు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారని… కానీ ఈరోజు హైదరాబాద్‌ను చూస్తే.. ఆ రోజు ఆయ‌న‌ చెప్పిన ప్రతి మాట నిజమని నమ్మాలని అన్నారు.

- Advertisement -

ఏపీలో స్టార్టప్‌లను ప్రోత్సహించడం, టెక్నాలజీ బదిలీకి ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్ల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో స్విస్ వెకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ మోడల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఏపీ యువతలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని కోరారు. పూణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్‌లు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement