Friday, November 22, 2024

AP: స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్

స్కిల్ డెవలప్ మెంట్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయం విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ… ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానాను దోచేశారన్నారు. డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించినట్లు ఈడీ తేల్చిందన్నారు. లేని కంపెనీని ఉన్నట్లు ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికినా… ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ప్రశ్నించరన్నారు. కోర్టు రిమాండ్ కు పంపినా … ప్రశ్నిస్తా అన్న వాళ్లు ప్రశ్నించరన్నారు. రూ.371కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారన్నారు. జైల్లో ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకుంటారన్నారు. చట్టం అందరికీ ఒక్కటేనని చెప్పిన వాళ్లు ఇంతవరకు లేరని, ఇప్పుడు చట్టం ఎవరికైనా ఒకటేనని చెప్పే గళాలు వినిపిస్తున్నాయన్నారు. ఆ గళాన్ని చంద్రబాబు ముఠా జీర్ణించుకోలేకపోతోందన్నారు.

చంద్రబాబు అడ్డంగా దొరికినా కూడా…అడ్డంగా నిలువునా దొరికారన్నారు. ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికారన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎటువైపు నిలబడాలని ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఆ పని సబబే అని కొందరు సపోర్టు చేస్తారన్నారు. చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారన్నారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో కాపు నేస్తం పథకం గురించి మాట్లాడుతూ… ఈ పథకం ద్వారా ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందచేసే సాయంతో ఇప్పటివరకు (నాలుగేళ్లలో) ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అదించినట్లు పేర్కొన్నారు. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమనన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్‌ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కేబినెట్‌లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్‌.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement