రాష్ట్రంలో జరిగిన రెండు దుర్ఘటనలకు చంద్రబాబే కారణమని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మీడియాతో రోజా మాట్లాడుతూ… కానుకల పేరుతో జనం ప్రాణం తీస్తున్నారన్నారు. ఇరుకురోడ్డులో సభలు పెట్టి జనాన్ని చంపుతున్నారన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారన్నారు. జగన్ పై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతున్నారన్నారు. లోకేష్ యాత్ర చేస్తే టీడీపీకే నష్టమని మంత్రి రోజా అన్నారు. లోకేష్ పాదయాత్రను ఆపాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement