వైద్య రంగంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ మంత్రి విడదల రజిని ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తెచ్చి దేశానికే ఆదర్శం అయ్యామని.. ప్రభుత్వం వైద్యరంగం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సేవలు ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చామని.. వైద్యం కోసం వచ్చే వారికి ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.
టీడీపీ హయాంలో ఒక్క డాక్టర్ ని కూడా నియమించలేదని.. వైద్య రంగాన్ని పూర్తిగా నీరుగార్చారని మండిపడ్డారు. వైద్య రంగానికి ఎంత మంచి చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు నాయుడుకి వైద్య రంగంపై మాట్లాడే హక్కు లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చారని.. నాడు – నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్ రూపురేఖలు మార్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు.