వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా చంద్రబాబు పై మరోసారి ధ్వజమెత్తారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని దుయ్యాబట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు.
ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.