Wednesday, November 20, 2024

Chandrababu | ఏపీకి రావాల్సిన నిధుల‌పై ఫోక‌స్ పెట్టండి…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, అమ‌రావ‌తి : ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నేడు త‌న పార్టీ ఎంపిల‌తో కేంద్ర మంత్రుల‌తో సమావేమ‌య్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జ‌రిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని కోరారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్ర‌త్యేకంగా ఎపిలతో చ‌ర్చించారు.

అలాగే, కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీ కొన్ని శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఎంపీలు ఢిల్లీలో ఉంటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే సూచించారు. విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని తెలిపారు.

ముఖ్యంగా, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించారు. కొత్త ప్రాజెక్ట్ లు ఎపికి తీసుకొచ్చేందుకు ఎంపిలు స‌మీష్టిగా కృషి చేయాల‌ని కోరారు.. ఎపి అర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్ర‌ బ‌డ్జెట్ లో రాష్ట్రానికి అథిక నిధులు కేటాయించేలా ఎంపిలు కేంద్రంపై వ‌త్తిడి తీసుకురావాల‌ని చెప్పారు.

కాగా, ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు… మనం ఏం చేయాలనేదే ముఖ్యం అని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement