టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఆయన అరెస్టుపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది. కాగా.. ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది.