Tuesday, January 7, 2025

AP | చంద్ర‌బాబు చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న !

  • మూడు రోజుల పాటు టూర్
  • ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

వెల‌గ‌పూడి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

పూర్తి షెడ్యూల్ ఇదే !

ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రకృతి వ్యవసాయం విజన్‌లను ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణకుప్పం విజన్ 2029పై చర్చించనున్నారు.

- Advertisement -

మధ్యాహ్నం 2 గంటలకు అగారాం కొత్తపల్లి గ్రామానికి వెళ్లి డ్వాక్రా సంఘాలతో సీఎం మాటామంతి నిర్వహించనున్నారు. 2:30 గంటలకు నడిమూరు గ్రామంలో సౌర విద్యుతీకరణ కార్యక్రమం ప్రారంభం అనంతరం స్థానిక యువతతో ఇష్టాగోష్టిలో పాల్గొంటారు.

అనంతరం సిగాల పల్లెకు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు ద్రవీడియన్ యూనివర్సటీ ఆడిటోరియంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. రాత్రి 7:30 గంటలకు ఆర్ అండ్ రాత్రి 7:30 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.

7వ తేదీన సీఎం కార్యక్రమాలు…

7న ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ ఆఫీసుకు సీఎం చేరుకుంటారు. అక్కడ జననాయకుడు సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ప్రజల నుంచి అర్జీల స్వీకరించనున్నారు.

మధ్యహ్నం 12:30 గంటలకు కంగుండి గ్రామానికి వెళ్లనున్న సీఎం… శ్యామన్న విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యహ్నం 1:30 గంటలకు కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చంద్రబాబు వెళ్తారు.

మధ్యహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకూ మథర్ డెయిరీ, శ్రీజా మహిళా పాల సేకరణదారుల సంస్థను సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్టీఆర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కాడా కమండ్ కంట్రోల్ రూం, మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు.

ఐఐటీ కాన్పూర్‌తో అవగాహన కుదుర్చుకుని కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా మార్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. మహిళా శక్తి భవన్‌లో ఏలీప్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

సీఈవో బిగ్ బాస్కట్, ఎన్డీడీపీ చైర్మన్‌లతో సమావేశం అవుతారు. రాత్రికి అక్క‌డే బ‌స చేసి మ‌ర్నాడు అక్క‌డ నుంచి బ‌య‌లుదేరి నేరుగా విశాఖ వెళ‌తారు.. అక్క‌డ ప్ర‌ధాని పాల్గొనే స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement