అమలాపురం – వచ్చే ఎన్నికల్లో తమ వ్యూహం తమకు ఉందని, కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె బుధవారం నాడు అమలాపురంలో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం అన్నారు.
రాజకీయ సమీకరణాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఆరోపించారు.. నాడు చంద్రన్న, నేడు జగనన్న అంటూ స్టికర్ అంటించి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే వైద్యం అందిస్తున్నారని,.. కానీ, ఆయుష్మాన్ భవ పథకం క్రింద కేంద్రం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక, రాష్ట్రానికే కాకుండా జిల్లాల వారీగా కేంద్ర సహకారం అందిస్తున్నారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయన్న ఆమె చంద్రయాన్ తీసిన మొదటి ఫోటోలో రోడ్డు దుస్థితి కనపడిందన్నారు.. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడినుండి పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తివాదులు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. ఎన్నికలలో తమ వ్యూహం మాకు ఉందని అంటూ రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తామన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి.