సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న అరెస్టయిన అల్లు అర్జున్… చంచల్‌గూడ జైలు నుండి ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు దర్శక నిర్మాతలతో పాటు పలువురు స్టార్ హీరోలు బన్నీ నివాసానికి వస్తున్నారు.
ఈ ఘటనపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి అరెస్ట్‌పై ఆరా తీశారు. అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ బన్నీని పరామర్శించారు.