- ఉచిత బస్సు, రైతు భరోసాపై చర్చ
- బానకచర్ల ప్రాజెక్ట్ పై కీలక నిర్ణయం
- పెట్టుబడిదారులకు భూ కేటాయింపులపై ఆమోద ముద్ర
- గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10శాతం రిజర్వేషన్
- ఇతర అంశాలపైన కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం
వెలగపూడి – ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో చర్చిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం బానకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. కాగా.. ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశముంది. ఇక, పలు కంపెనీలకు భూములు కేటాయింపులకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు.. గీత కార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. మరోవైపు కేబినెట్ భేటీ అనంతరం.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది.