Tuesday, November 26, 2024

High Court: చంద్రబాబు బెయిల్.. ఇద్దరు డీఎస్పీల సీఐడీ అభ్యర్థన తిరస్కరణ

అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెయిల్ షరతుల్లో మరికొన్ని అదనపు షరతులు విధించాలని సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది.

స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగించాలని పేర్కొంది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన హైకోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement