అమరావతి – ‘‘పెన్నా టు వంశధార’’ పేరుతో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టనున్నట్లు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేపడతారని అన్నారు. కొన్ని ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసేసిన విధానాన్ని ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని చెప్పారు. చంద్రబాబు చేపట్టే పెన్నా టు వంశధార కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చూడొద్దని.. ప్రజా అవగాహన కార్యక్రమంగా చూడాలన్నారు. జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు దోపిడీనే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వ్యవసాయ, సాగునీటి రంగాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ భ్రష్టు పట్టించారన్నారు. ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వివరాలు ..
◻️ ఆగస్టు ఒకటిన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శన
◻️ నందికొట్కూరులో చంద్రబాబు బహిరంగ సభ
◻️ అనంతరం మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శన
◻️ ఆలూరులో చంద్రబాబు రాత్రి బస
◻️ ఆగస్టు 2న మాల్యాల ఎత్తిపోతల పథకం సందర్శన
◻️ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలన
◻️ నందికొట్కూరు గోరకల్లు రిజర్వాయర్ సందర్శన
◻️ అనంతరం పాణ్యం, బనగానపల్లి, కోవెలకుంట్లలో పర్యటన
◻️ జమ్మలమడుగులో చంద్రబాబు రాత్రి బస
◻️ ఆగస్టు 3న గండికోట రిజర్వాయరు సందర్శన
◻️ పైడిపాలెం రిజర్వాయర్ పరిశీలించనున్న చంద్రబాబు
◻️ అనంతపురంలో చంద్రబాబు రాత్రి బస –
ఆగస్టు 4న అమిద్యాలలో నిలిచిపోయిన బిందు సేద్యం ప్రాజెక్టు పరిశీలన
◻️ అనంతరం ఒంటిమెట్ట వద్ద నిలిచిపోయిన జీడిపల్లి-బీటీపీ కాలువ పరిశీలన
◻️ ఆత్మకూరు సమీపంలో ఆగిపోయిన జీడిపల్లి-పేరూరు కాలువ పనుల