అమరావతి: ఎన్డీయే అభివృద్ధి విధానాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ‘టైమ్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్: ది నీడ్ టు కీప్ ఫైటింగ్’ అనే అంశంపై ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘ప్రధాని మోడీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నాం. మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్‌ను గుర్తిస్తోంది. టెక్నాలజీతో పేదరికాన్ని రూపుమాపొచ్చు. మోడీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రధాని విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం. ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా సెంటిమెంట్ తోనే ఎన్డీఎకి దూరం … మోడీ పాలన భేష్ – చంద్రబాబు
Advertisement
తాజా వార్తలు
Advertisement