Friday, November 22, 2024

జగన్ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం – చంద్రబాబు

పెట్రేగి పోతున్న ల్యాండ్‌ మాఫియా

  • ప్రభుత్వ, కష్టపడి సంపాదించుకున్న భూములు కబ్జాలమయం
  • దేశంలోనే ధనిక సీఎం..
  • నాసిరకం మద్యంతో ప్రజారోగ్యాన్ని, డబ్బుల్ని దోచేస్తున్నాడు
  • లిక్కర్‌ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కే..
  • జగన్ క్యాన్సర్‌ లాంటి వాడు
  • ప్రజలను పట్టిపడీస్తున్నాడని విమర్శ
  • తమ్ముళ్లు రోడ్డు మీదకు వస్తే బూతులు ఎమ్మెల్యే పరార్
  • గుడివాడ సభలో చంద్రబాబు
  • ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా) – రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, ప్రజలు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న ప్రైవేట్ ఆస్తులను అధికార పార్టీ నేతలు మెడపై కత్తి పెట్టి కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పాలనకు చరమగీతం పాడి ప్రజల ఆస్తులను సంరక్షించే తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం రాత్రి గుడివాడలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలపైన ఇంటి పన్ను, చెత్త పన్ను వేసిన చెత్త సీఎం.. నిత్యావసరాల ధరలు, విద్యుత్‌ చార్జీలు ఇలా అన్నీ పెంచుకుంటూ పోతున్నారు.
  • అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచామని… తాను అనుకున్న చైతన్యం ఇప్పుడు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మన:సాక్షితో ఓటు వేయాలని కోరామని తెలిపారు. 23 ఓట్లు.. 23వ తేదీన.. 23 సంవత్సరం గెలిపించారని.. ఇది కాదా దేవుడి స్ర్కిప్ట్ అంటే.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. మన రాజధాని అమరావతి ఏమైంది తమ్ముళ్లూ! రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన జగన్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు పేర్కొన్నారు.
  • ఇతర రాష్ట్రాలకు పోతే మీ రాజధాని ఏమిటని అడిగితే ఏం చెప్పుకుంటాం మనం. జగన్‌రెడ్డికి, వైసీపీ నాయకులకు సిగ్గు లేకపోతే పోయింద అన్నారు.
  • నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని డబ్బులను దోసెస్తున్నారని విమర్శించారు. మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. మీరు ఇంకో 20 ఏళ్లపాటు తాగుతూనే ఉన్నా ఆ అప్పు తీరద అన్నారు. చిన్న కిరాణా కొట్టుల్లో కూడా గూగుల్‌ పే, పేటీఎంలు ఉంటే మద్యం షాపుల్లో మాత్రం ఓన్లీ క్యాష్‌. మద్యం పేరుతో రూ.35 వేల కోట్లు దోచేశారు. తయారు చేయడం.. హోల్‌సేల్‌.. రిటైల్‌ అన్నీ జగన్‌రెడ్డివే. ఆదాయం అంతా తాడేపల్లి ప్యాలెస్‌కే. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు., ఇతనా పేదల కోసం పోరాడేది అని ప్రశ్నించారు.
  • రూ.510 కోట్ల ఆస్తితో దేశంలోనే సంపన్న సీఎంగా ఉన్న ఆయన.. పేదవాడినంటూ డ్రామాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. పెంచిన చార్జీలు, ధరల ద్వారా 4.5 లక్షల కోట్ల భారాన్ని మోపిన ఘనత ఈ సీఎంది. అప్పుల భారాన్నీ మోపుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై పెట్టాడు. దీన్ని ఎవరు తీరుస్తారు? అని ప్రశ్నించారు. టీడీపీ ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు ఇస్తే.. పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన ఘనత జగన్‌ రెడ్డిది. అధికారంలోకి రాగానే నేను చేసిన కృషిని బూడిదలో పోసిన పన్నీరు చేశాడని విమర్శించారు. జగనే భవిష్యత్ అంట.. జగనే మా నమ్మకం అంట. జగనే నమ్మకం కాదు.. జగనే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. జగన్ పోతేనే పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తు. జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమే అని అన్నారు.
  • ఇల్లు మీది.. స్టిక్కర్ సైకోది. మధ్యలో సైకో పెత్తనం ఏంటి? ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంటికి స్టిక్కర్లు అతికించడం అనైతికం. చట్ట వ్యతిరేకం’’ అని చెప్పారు. బాబాయ్ గురించి ఏం చెప్పాలి. బాబాయ్ ని అనునిత్యం చంపేస్తున్నారు. మొదటి రోజు గుండెపోటు.. తర్వాత రక్తపోటు. ఆ తర్వాత.. గొడ్డలితో చంపి నా పేరు పెట్టాలనుకుంటున్నారంటే ఏం దొంగలు. వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు, ఆర్తిక ఉగ్రవాదులు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరుగుతున్నాయి ప్రతిచోటా ల్యాండ్‌ మాఫియాలు తయారవుతున్నాయి. ఖనిజ సంపదను దోచేశారు. గెలాక్సీ గ్రానైట్‌, లేటరైట్‌.. ఏది దొరికితే అది మింగేశారు.
  • ‘నిత్యవసర ధరలు పెరిగాయి. కరెంటు చార్జీలు పెంచారు. ఇచ్చేది పది.. గుంజేది వంద. బయటి రాష్ట్రాల ప్రజలు ఏపీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు. సమాజానికి క్యాన్సర్‌ లాంటివాడు జగన్‌ అని విమర్శించారు. ‘‘జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ. ప్రజలను పట్టి పీడిస్తున్నాడు’’ అని నిప్పులుచెరిగారు. ‘చివరి సంవత్సరం.. ఇంకొన్ని నెలలే.. సైకో పోవడం ఖాయం. రాష్ట్రం నుంచి సైకో పోకపోతే.. మనమే రాష్ట్రం వదిలి పోయే పరిస్థితి నెలకొంది’’ అని చంద్రబాబు అన్నారు. బూతులు ఎమ్మెల్యే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాడని, ఆయన మర్చిపోయిన ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
  • గుడివాడ పరిసర ప్రాంతాల్లో అనేక అక్రమాలకు పాల్పడుతూ దందాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ తమ అక్రమాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, టిడిపి నాయకులు వర్ల రామయ్య, రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము వర్ల కుమార్ రాజా, తదితరులు పాల్గొన్నారు.
  • .
Advertisement

తాజా వార్తలు

Advertisement