అమరావతి – ఎమ్మెల్సీ ఎన్నికల రోజైన ఈ నెల 13వ తేదిన స్థానికేతరుడైన , టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో పోలింగ్ బూత్ లను సందర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిపి అధినేత ఎపి ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.. దీనికి ఈసి స్పందిస్తూ, ఈ ఘటనపై విచారణ జరిపి ఫ్లయింగ్ స్క్వాడ్, తహసీల్దార్, ఎస్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.. అయితే అధికారులతో పాటు వైవి సుబ్బారెడ్డిపైనా తక్షణం చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు మరో లేఖ రాశారు.. వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ స్థానికేతరుడైన సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని? అని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో పర్యటించిన సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవలసిందేనని ఈసిని చంద్రబాబు కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement