అమరావతి – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ మరో వినూత్న కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపు ఇచ్చింది.. న్యాయానికి సంకెళ్లు పేరుతో ఈ నెల 15వ తేదిన నిర్వహించే ఈ కార్యక్రమంలో చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలపాలని కోరింది.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ, చంద్రబాబు గారు ప్రజలకు మంచి చేయడం ఒక సైకోకు నచ్చలేదు. నిజాయితీపై కక్షగట్టి న్యాయానికి సంకెళ్లు వేసాడు. నువ్వు చేసింది తప్పు అని ఆ సైకోకి చెబుదాం. అక్టోబర్ 15, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు చేతులకు సంకెళ్లు వేసుకుని ప్యాలెస్ లోని నేరగాడికి చూపిద్దాం అంటూ కోరింది..
Chandra babu in Jail – న్యాయానికి సంకెళ్లు నిరసన కార్యక్రమానికి టిడిపి పిలుపు
Advertisement
తాజా వార్తలు
Advertisement