Wednesday, September 18, 2024

Chandra Babu – ఎపి వాలంటీర్లకు తీపి కబురు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖపై సచివాలయం లో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించు కునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితోపాటు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో సమావేశం లో ఇదే అంశంపై చర్చిద్దామని చెప్పారు.రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి .

- Advertisement -

అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని అధికారుల్ని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం. శాఖ పనితీరు, పథకాల అమలుపై చర్చించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా దళిళ వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement