అమరావతి : చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదో ఆయన్నే అడగాలన్నారు. తాము ఎవర్నీ స్పందించమని కోరడం లేదని.. వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.
ఒకవేళ అందర్నీ అడిగినట్లైతే, జూనియర్ ను కూడా అడిగేవాళ్లమన్నారు. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చారని, తాము ఆర్గనైజ్ చేయలేదని.. అక్కడెవరైనా తెలుగు దేశం వాళ్లు కనిపించారా అని ఎదురుప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత మొదటిసారి మళ్ళీ ఇప్పుడే అలా రోడ్లమీదికి వచ్చారంటే చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుసుతున్నారన్నాని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత శనివారం అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచారు. బాలకృష్ణ తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. జైలుకు వెళ్లి ములాఖత్ అయి వచ్చారు. కానీ, ఆ రోజు నుంచి జూనియర్ దీనిమీద ఎలాంటి కామెంట్ చేయలేదు.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అన్న ప్రశ్నవచ్చిన సమయంలో అందరి దృష్టి జూనియర్ వైపే ఉంది. కానీ, దీనిమీద జూనియర్ ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వడంలేదు. అదే విషయాన్ని విలేకరులు అడిగినప్పుడు అచ్చెన్న ఇలా స్పందించారు