Tuesday, November 26, 2024

Chandra Babu – బుడ‌మేరు ప‌రివాహ‌క ప్రాంతాల‌లో ఏరియ‌ల్ స‌ర్వే..

విజ‌య‌వాడ – ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్‌లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా గ‌మ‌నించారు. బుడమేరుకు పడిన గండ్లు, గండ్లు పూడ్చే పనులను కూడా వీక్షించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని ఏరియల్ విజిట్‌లో చూశారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను.. కృష్ణా నది సముంద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను చంద్రబాబు పరిశీలించారు.

వేగంగా కొన‌సాగుతున్న గండి పూడ్చివేత ప‌నులు …

మరోవైపు బుడమేరు గండి పూడ్చివేత పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కుండపోత వర్షంలోనూ గండి పూడ్చివేత పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి అధికారులు తరలించారు. సరుకు బాదులు నిలబెట్టి నీటిని తాత్కాలికంగా రేకులు ద్వారా వరద నీటికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

6వ మద్రాస్ మిలిటరీ బెటాలియన్ నుంచి 120 మంది అధికారులు, జవాన్లు గండి పడిన ప్రాంతానికి వచ్చారు. మరికొద్ది సేపట్లో మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూడ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. తాత్కాలికంగా రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడుస్తామని మిలిటరీ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement