Sunday, November 24, 2024

ప్రాక్టికల్స్ లోనూ.. చై..నా.. జిమ్మిక్కులు ..!

కార్పొరేట్ చై..నా.. కళాశాలల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ కళాశాలల ద్యార్థులను టాపర్లుగా ప్రకటించు కునేందుకు అనేక జిమ్మి క్కులకు పాల్పడుతున్నారు. ప్రాక్టికల్స్ లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్ కళాశాలలన్నీ ఏకం కావడం గమనార్హం. ఇంటర్ స్కోర్ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్ లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ కళాశాలలు తమ ద్యార్థులకు ప్రాక్టికల్స్ వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. మరో వైపు కార్పొరేట్ ద్యా సంస్థల్లో మార్కులు, ర్యాంకుల కోసం ద్యార్థులను బట్టీ చదువులు చది స్తూ వారి ‘జీ ‘తాలతో చలగాట మాడుతున్నారు.

ప్రభన్యూస్ బ్యూరో, ఒంగోలు
ఇంటర్ లో ప్రభంజనం.. స్టేట్ టాపర్ మా కళాశాల విద్యార్థి.. అంటూ రిజల్ట్ రోజున చెవులు చిల్లులు పడేలా టీవీల్లో
నిషానికో సారి ప్రచారం చేసే కార్పొరేట్ కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు తారుమార వుతున్నాయి. అందుకే ద్యార్థి గణనీయమైన మార్కులు సాధించేలా కళాశాలలు ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ప్రాక్టికల్స్ లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్ కళాశాలలన్నీ ఏకమయ్యాయి. తమ కళాశాలలకు ద్యార్థులకు మంచి మార్కులు తెప్పించేందుకు డబ్బు కుమ్మరిస్తున్నాయి.


టార్గెట్ 30కి 30..
ఇంటర్ లో జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్ స్కోర్ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్ లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ కళాశాలలు తమ ద్యార్థులకు ప్రాక్టికల్స్ వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు కృషి చేస్తాయి. అయితే ప్రాక్టికల్స్ పై ఎప్పటి నుంచో పథకం రచించిన జిల్లాలోని పలు కార్పొరేట్ కళాశాలలు.. అందులోనూ చైతన్య, నారాయణ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నాయి. 30కి 30 మార్కులు తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతు న్నాయి.

బట్టీ చదువులతో..
కార్పొరేట్ విద్యా సంస్థల్లో మార్కులు, ర్యాంకుల కోసం ద్యార్థులను బట్టీ చదువులు చదిస్తూ వారి జీతాలతో చలగాటమాడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల్లో చది స్తే తమ పిల్లలు జీతంలో పైకి వస్తారనే ఆలోచనతో తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చది స్తున్నారు. అయితే ఈ చై..నా..కళాశాలల్లో బట్టీ చదువులతో ద్యార్థులు బ దీఖానా అవుతున్నారు. తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు స్పెషల్ క్లాసులంటూ ద్యార్ధులు రీడింగ్.. రీడింగ్ అంటూ వత్తిడికి గురవుతున్నారు. సిలబస్ పూర్తి కాక ముందే పరీక్షలు పెడుతుండటంతో మార్కులు తక్కువ వస్తున్న ద్యార్థులు మానసికంగా కృంగిపోతు న్నారు. రూ.వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నా.. ఇవేమి మార్కులు అంటూ తల్లిదండ్రులు ఆగ్రహాలు చేస్తుండటంతో ద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. కానీ ఈ చై..నా కళాశాలల్లో అది పట్టడం లేదు. బట్టీచదువులు చది స్తూ.. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడం
పరిపాటిగా మారింది.

- Advertisement -

నో లిఫ్ట్..
నగరంలోని మంగమూరు రోడ్డులో ఉన్న నాలుగు అంతస్తుల నారాయణ జూనియర్ కళాశాలలో లిఫ్ట్ సౌకర్యం లేక పోవడంతో ద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్యార్థులు ప్రతి రోజూ నాలుగు అంతస్థులు ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రోజుల్లో చిన్నపాటి ఇళ్లు కట్టుకున్నా అందులో తప్పని సరిగా లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటున్న రోజుల్లో కూడా నాలుగు అంతస్థుల నారాయణ కళాశాలలో లిఫ్ట్ లేక పోవడం గమనార్హం. అయినా పట్టించుకునే నాథుడే లేడు. కేవలం అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే కార్పొరేట్ యాజమాన్యం తరువాత అన్ని సౌకర్యాలు కట్ చేస్తున్నారు. అంతే కాదు వేల రూపాయలు ఫీజులు చెల్లించినా.. పిల్లల కోసం కిందే నిరీక్షించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఎదురవుతోంది. తరగతి గదులు, బాత్రూంలు ఎలా ఉన్నాయనే షయాన్ని కూడా చూడనివ్వని పరిస్థితి నెలకొంది. చైతన్య, నారాయణ కార్పొరేట్ కాలేజీల ద్యావ్యాపారం పై మర్శలు గుప్పుమంటున్నా వారి పై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
చై..నా ఇష్టారాజ్యం..
చైతన్య, నారాయణ కార్పొరేట్ కాళాశాలల పేరు చెబితేనే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కార్పొరేట్ సంస్థల ద్యా వ్యాపారం పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఆ రెండు కాలేజీల పై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఎవరే అనుకుంటే మాకే లే.. మాకు డబ్బులు వస్తున్నాయి.. అంతే చాలు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు కార్పొరేట్ సంస్థల ద్వారా వ్యాపారం ప్రారంభమై ఎన్నో సంవత్సరాలు అవుతోంది. వందలాది మంది ద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా కార్పొరేట్ సంస్థల యాజమాన్యాల పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement