ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం పనులు నిలిపివేసినట్లు నివేదికలో పేర్కొన్న కేంద్రం… ఇప్పటికే కేఆర్‌ఎంబీ నివేదిక ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. వాస్తవ, సాంకేతిక పరిస్థితులపై ఇప్పటికే కేఆర్‌ఎంబీ నివేదిక ఇచ్చింది. పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలో పేర్కొంది. డీపీఆర్ కోసం పనులు జరిగినట్లు కనిపించట్లేదని ఎన్‌జీటీ తెలిపింది. తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉల్లంఘనలపై ఎన్‌జీటీ చర్యలు తీసుకునే అధికారంపై వాదనలు జరిగాయి. వాదనలు వినిపించడానికి ఏపీ ప్రభుత్వం మరింత సమయం కోరింది. దీనిపై విచారణను ఈనెల 16కు ఎన్‌జీటీ వాయిదా వేసింది.
రాయలసీమ పనులపై ఎన్‌జీటీకి తెలంగాణ ఆధారాలు సమర్పించింది. ఫొటోలు, వీడియోలు సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను కేఆర్ఎంబీ బృందం తనిఖీ చేసింది. తనిఖీ నివేదికను ఇప్పటికే ఎన్‌జీటీకి అందించింది. తదుపరి విచారణలో అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ఇకపై ఈజీగా సిలిండర్..