ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో భాగంగా విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో, విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ ఆధ్వర్యంలో, కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందని కేంద్రం తెలిపింది. గుంటూరు, పెనుకొండ, విశాఖ, అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేశామని.. అవి ప్రస్తుతం భూసేకరణ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు రాజమండ్రి, విశాఖలోని మల్కీపురంలో ఈఎస్ఐ ఆసుపత్రులు పుననిర్మాణంలో ఉన్నాయని, విజయవాడలో కూడా సీపీడబ్ల్యూడీ శాఖకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం బాధ్యతలు అప్పజెప్పారని కేంద్రం తెలిపింది.
ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త.. కొత్తగా ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు
Advertisement
తాజా వార్తలు
Advertisement