Tuesday, November 26, 2024

బ్రహ్మంగారి మఠానికి కేంద్ర టూరిజం ప్రసాదం ప్యాకేజీని కేటాయించాలి

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గొడ్లవీటి సుబ్రహ్మణ్యం గృహంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి గురవాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి వేణుమాధవ్ కలిసి రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ స్థితిగతులు భవిష్యత్తు అభివృద్ధికై పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో ముందుకు వెళ్లాలని… కేంద్ర ప్రభుత్వం బ్రహ్మంగారి మఠానికి టూరిజం డిపార్ట్ మెంట్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి సహకారంతో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ద్వారా బ్రహ్మంగారి మఠానికి కేంద్ర టూరిజం ద్వారా ప్రసాదం ప్యాకేజీ తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ పంచ వృత్తులు, అనేక రకాల వృత్తులు ఉద్యోగాల్లో, వ్యాపార రంగంలో ఉన్న విశ్వబ్రాహ్మణ యువతను నూతన నాయకత్వం ముందుకు తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కుందుర్తి గురవాచారి గొడ్లవీటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య యాత్ర 26 జిల్లాలు రాష్ట్రంలో అన్ని సంఘాల ముఖ్య నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికై త్వరలో ఒంగోలు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి సమన్వయ సమావేశం త్వరలో ఏర్పాటు చేయ‌నున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా పేద విశ్వబ్రాహ్మణులకు రావాల్సిన సంక్షేమ సహకారం సబ్సిడీ లోన్లు యువతకి భవిష్యత్తుకై పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి పెద్దలతో అవగాహన సదస్సు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘాలు ఓకే నాయకత్వాన్ని కృషి చేయడానికి త్వరలో పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఐకమత్యానికి నాంది పలకాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి రెండు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ నాయకులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డితో విశ్వబ్రాహ్మణులంద‌రూ సమావేశమై ఢిల్లీలో బ్రహ్మంగారిమఠం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా ప్రసాదం స్కీం బ్రహ్మంగారిమఠం కోరడం పట్ల తల్లోజుఆచారికి ప్రత్యేక అభినందనలు ఈ సమావేశంలో తీర్మానించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని 8వ తరం పీఠాధిపతి కుమారుడు వెంకటాద్రి స్వామివారిని వీరంబోట్టయ్యను శ్రీ ఈశ్వరి దేవి పీఠాధిపతులు శివ కుమార్ స్వామిని, గోవింద స్వామిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు ఆరికట్ల గోవర్ధన శాస్త్రి, విజయవాడ పడమట బ్రహ్మంగారి దేవస్థానం చైర్మన్ రేటురి రత్న శేఖర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement