కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ అధికారులతో సీడబ్ల్యుసీ, జలశక్తి అధికారులు భేటీ అయ్యారు. ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే రేపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సీడబ్ల్యుసీ డామ్ డిజైనింగ్ కమిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై రేపు కీలక సమావేశం జరుగనుంది. దిగువ కాఫర్ డ్యాం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్) డిజైన్లపై చర్చ జరుగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital