ఏపీ రాజధాని విషయంలో కేంద్రం తీరు ఆసక్తిని కలిగిస్తోంది. రాజధాని విషయంలో కేంద్రం ఓ స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ప్రతిసారి గందరగోళం సృష్టిస్తోంది. ఇటీవల ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం. మరోసారి లోక్‌సభ సమావేశాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ… ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే, దీనిపై మళ్లీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం… వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.
విశాఖ ఒక నగరం మాత్రమేనని తాజాగా కేంద్రం పేర్కొంది.. పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని క్లారిటీ ఇచ్చింది.. ఇక, హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందన్న కేంద్ర ప్రభుత్వం.. హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన సిటీ పేరును కూడా చేర్చుతున్నామని వెల్లడించింది. దీనిపై లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామని, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. వైజాగ్ పరిపాలన రాజధానిగా నిర్ణయించింది.. ఇక, త్వరలోనే వైజాగ్ నుంచి పాలన ప్రారంభిస్తామని కూడా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హోటల్ లో 3 వేలకు చిన్న రొట్టెముక్క పెట్టారు..