Saturday, January 11, 2025

Funds Released | సంక్రాంతి సంబరం.. రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల !

సంక్రాంతి పండుగ సందర్భంగా కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా కింద మొత్తం రూ.1,73,030 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3637 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించారు.

కాగా, పన్నుల వసూళ్లలో కేంద్రం 41 శాతం రాష్ట్రాలకు వాటాగా విడుదల చేస్తుంది. ఈసారి విడుదలైన వాటాలో యూపీకి అత్యధికంగా రూ.31,039.84 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత బీహార్‌కు రూ.17,403.36 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.13017.06 కోట్లు, మహారాష్ట్రకు రూ.10,930.31 కోట్లు, రాజస్థాన్‌కు రూ.10,426.78 కోట్లు కేటాయించారు.

ఈ రాష్ట్రాల తర్వాత తమిళనాడుకు రూ.7057.89 కోట్లు విడుల చేసింది కేంద్రం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా గోవాకు రూ.667.91 కోట్లు, సిక్కింకు రూ.671.35 కోట్లు వచ్చాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement