Friday, November 22, 2024

AP: ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన..!

ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన నాయకుల స్టేట్ మెంట్లతో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనతో ఎలక్షన్ హీట్ కూడా పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీకి వచ్చింది. ఈరోజు, రేపు వారు రాష్ట్ర అధికారులతో చర్చలు జరుప‌నున్నారు.

ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. సీఈవో, సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల అధికారులు సమావేశమ‌య్యారు. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణతో పాటు ఓటరు జాబితా రూపకల్పనపై చర్చిస్తున్నారు.రాష్ట్రంలో ఓటరు జాబితాపై ఇటీవల వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తొలి రోజు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల బృందానికి నివేదిక అందించనున్నారు.రేపు మరో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇవ్వనున్నారు. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement