Saturday, September 7, 2024

Central Budget .. లోక్ స‌భ‌లో నిర్మ‌ల ప‌ద్దు.. ఎపికి భారీ కేటాయింపులు

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ – లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు. కాగా , ఈ బ‌డ్జెట్ లో ఎపికి భారీగా కేటాయింపులు చేశారు. అమ‌రావ‌తికి 15 వేల కోట్లు కేటాయించ‌గా, పోల‌వరం నిర్మాణానికి 12 వేల కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు అధికారికంగా నిర్మ‌ల ప్ర‌క‌టించారు..

భారతదేశం ఇలాగే ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ‘మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించాము. దీని వల్ల 80 కోట్ల మందికి పైగా పేదలు లబ్ధి పొందుతున్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ఐదు పథకాల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు. దీనివల్ల ఐదేళ్లలో 4 కోట్ల 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాలకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్ ఇస్తామని మధ్యంతర బడ్జెట్‌లో హామీ ఇచ్చాం’ అని అన్నారు.

- Advertisement -

బడ్జెట్‌లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

  1. వ్యవసాయంలో ఉత్పాదకత
  2. ఉపాధి, సామర్థ్యం అభివృద్ధి
  3. సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
  4. తయారీ, సేవలు
  5. పట్టణాభివృద్ధి
  6. శక్తి భద్రత
  7. మౌలిక సదుపాయాలు
  8. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి
  9. తదుపరి తరం మెరుగుదలలు(Next generation reforms)

నిర్మ‌ల ప్ర‌సంగంలోముఖ్యాంశాలు

ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి విజయం సాధించారు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతోనే ఈ విజయం లభించింది.. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజు వృద్ధి చెందుతోంది.. ద్రవ్యోల్బణం తగ్గుతుంది.. పేదలు, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా పథకాలు, రైతుల కోసం ఇటీవల అన్ని పంటల మద్దతు ధరలు పెంచాం. -నిర్మలా సీతారామన్.

ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, మధ్య తరహా పరిశ్రమలపై ఈ బడ్జెట్‌లో దృష్టి పెట్టాం.. నాలుగు కోట్ల యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి.. ఈ బడ్జెట్‌తో వికసిత్ భారత్‌కు రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నాం.. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట.. యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.. 4 కోట్ల మందికి స్కిల్ పాలసీ.. కోటి మంది రైతులకు సహజ సేద్యంపై శిక్షణ.. కూరగాయల ఉత్పత్తి, సరఫరాకు ప్రత్యేక చర్యలు.

ఆహార,ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైంది.. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలను గణనీయంగా పెంచాం.. కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం.. ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది.. నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్‌లో దృష్టి పెట్టాం..ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.. ఉద్యోగం, స్కిల్, ఎంఎస్‌ఎంఈలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాం.

కేటాయింపులు ..

ఢిల్లీ: లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్‌.. విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.. వ్యవసాయం డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం.. 400 జిల్లాల్లో అమలు.. మూడు స్కీంల ద్వారా ఉద్యోగ కల్పన.. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం.. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు.. 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం.. మహిళలనైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు

ఎపికి కేటాయింపులు

రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం
భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు

వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
రూ.26 వేల కోట్లుతో బిహార్‌లో నూతన హైవేలు, వంతెనల నిర్మాణం
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు
500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన
వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం

మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక
ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక
అసోంలో వరద నివారణ, నియంత్రణకు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సాయం
హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింలో ప్రకృతి బీభత్సాలకు సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు
టూరిజం అభివృద్ధి కింద గయాలోని విష్ణుపాద, బుద్ధగయలోని మహబోధి ఆలయాలకు ప్రపంచస్థాయి అభివృద్ధి
కాశీ విశ్వనాథ కారిడార్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి
రాజగృహ ప్రత్యేక అభివృద్ధికి నిధులు
సప్తర్షి ఉష్ణకుండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశోధనలకు నిధులు అందుబాటు
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి వెంచర్‌ క్యాపిటల్‌ కింద రూ.వెయ్యి కోట్లు
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

నిరుద్యోగుల కోసం మూడు పథకాలు
• ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
• ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
• సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
• గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
• 210 లక్షల మంది యువతకు లబ్ధి
• ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
• వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
• వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
• దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
• అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
• మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement