అంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – ఎపి అవసరాలను గుర్తించి కేంద్రం బడ్జెట్ లో అవసరమైన నిధులు, ప్రాజెక్ట్ లు , పలు పథకాలు, ప్రకటించడం పట్ల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.. అమరావతి, పోలవరం నిర్మాణాలు కేంద్రం అందించే నిధులతో పరుగులు పెడతాయని అన్నారు చంద్రబాబు.. యూనియన్ బడ్జెట్లో ఎపిలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మరింత వేగవంతమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు..అలాగే ముందు చూపుతో ప్రగతిశీల , విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ను సమర్పించినందుకు మరోసారి మోదీకి ధన్యవాదాలు చెప్పారు.
పవన్ కల్యాణ్ కూడా…
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.