Friday, November 22, 2024

Central Budget – ఎపి, తెలంగాణ‌కు రైల్వే కేటాయింపులు ఇవే ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ – ఈసారి బ‌డ్జెట్ లో ఎపి,తెలంగాణ రైల్వే ల‌కు భారీగా నిధుల కేటాయించామ‌ని వెల్ల‌డించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ .. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామ తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పదింతలు పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వంద శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్‌ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.
”అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు రూపొందించాం. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతి ఆయోగ్‌ ఆమోదించింది. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశముంది. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. భూమి కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు” అని కేంద్ర మంత్రి తెలిపారు.

తెలంగాణలో..

”తెలంగాణలో రైల్వే లైన్లు వంద శాతం విద్యుద్దీకరణ జరిగాయి. రాష్ట్రంలో రూ.32,946 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అమృత్‌ పథకం కింద 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా అభివృద్ధి జరిగాయి” అని కేంద్ర మంత్రి వివరించారు.
తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ. 5,336 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు . ఇక తెలంగాణ పూర్తిగా 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్లు ఉన్న రాష్ట్రం అని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో 437 అండర్ పాస్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయ‌ని అన్నారు. అలాగే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ నిర్మాణ ప‌నులు పూర్తి అయ్యాయ‌ని, త్వ‌రలోనే దానిని ప్రారంభిస్తామ‌ని అశ్విని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement